Vinjamoor: 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్!

Vinjamoor: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు పట్టణంలోని సిద్ధార్థ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసి, పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

V. Kamaiah, Vinjamuru
Published on: 1 Oct 2026 4:26 PM IST
Vinjamoor
X

Vinjamoor: 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్!

Vinjamoor: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.వింజమూరు పట్టణంలోని సిద్ధార్థ నగర్ కాలనీలో నిర్వహించిన NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులు,ఇతర అర్హులైన లబ్ధిదారులకు NTR భరోసా పెన్షన్లు అందిస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

పేదల జీవితాల్లో భరోసా నింపడంతో పాటు,అవసరమైన సమయంలో వారికి ప్రభుత్వం అండగా నిలవడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru