Nellore: 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని కొవ్వొత్తులు వెలిగించారు.
Nellore: 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరులోని చింతారెడ్డిపాలెం క్యాంపు కార్యాలయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించారు మంత్రి పొంగూరు నారాయణ... ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారాయణ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభయాన్’కు మద్దతు ప్రకటించారు.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అవగాహన కల్పిస్తూ, చివరి అర్హుడి ఇంటి వరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు..సేవ, సంక్షేమం, ప్రజాభాగస్వామ్యంతో వికసిత్ భారత్ నిర్మాణం దిశగా ప్రతి కుటుంబం, ముఖ్యంగా యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు మంత్రి నారాయణ.




