Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన సైకిల్!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన టీడీపీ. ఎంపీ బీదా మస్తాన్‌రావుతో కలిసి మంత్రి నారాయణ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం. సైకిల్ గుర్తుకు ఓటేయాలని పిలుపు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 29 Oct 2026 6:29 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన సైకిల్!

Nellore: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో సైకిల్‌ స్పీడు పెంచింది. రోజుకు పది డివిజన్లను చుట్టేస్తూ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బుధవారం 69, 9, 23 డివిజన్లలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావుతో కలిసి మంత్రి నారాయణ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మూడు డివిజన్లలోనూ స్థానికుల నుంచి ప్రచారానికి విశేష స్పందన లభించింది.

కార్పొరేటర్‌ అభ్యర్థులు షేక్‌ షాహీనా, తాళ్లూరి శశికుమార్‌, కాయల తిరుపతితో పాటు మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ను సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మంత్రి కోరారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE