Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ప్రచారం

Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి కూటమి కార్పొరేటర్, మేయర్ అభ్యర్థుల గెలుపు కోరుతూ విస్తృత ప్రచార ర్యాలీ నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 29 Oct 2026 3:43 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ప్రచారం

Nellore: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నెల్లూరు నగర 21వ డివిజన్‌లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గునుకుల విజయలక్ష్మిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కిషోర్ గునుకుల గారి ఇంటి వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్లలోని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE