Nellore: మంత్రి నారాయణ అభివృద్ధియే మాకు శ్రీరామరక్ష.. గజమాలతో సత్కరించిన విజేతలు!
Nellore: మంత్రి నారాయణ అభివృద్ధియే తమకు శ్రీరామరక్ష అని నెల్లూరు కార్పొరేషన్ విజేతలు కోటేశ్వరి, తిరుమల నాయుడు అన్నారు. మంత్రిని గజమాలతో సత్కరించారు.
Nellore: మంత్రి నారాయణ అభివృద్ధియే మాకు శ్రీరామరక్ష.. గజమాలతో సత్కరించిన విజేతలు!
నెల్లూరు: మంత్రి నారాయణ గారి అభివృద్ధియే శ్రీరామరక్షగా నిలవడంతో, కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ మెజారిటీని సాధించామని నూతన విజేతలు స్పష్టం చేశారు.. పదవ డివిజన్ విజేత కిన్నెర కోటేశ్వరి, పదిహేడవ డివిజన్ విజేత కాకర్ల తిరుమల నాయుడు ఈ భారీ విజయం తర్వాత మంత్రి నారాయణ గారిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ, తమ గెలుపునకు నారాయణ గారి పాలనలోని అభివృద్ధియే ప్రధాన కారణమని కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించి, భారీ గజమాలతో తమ కృతజ్ఞతను చాటుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ విజేతలు అభినందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని సాధించాలని దిశానిర్దేశం చేశారు.




