Nellore: 2028 నాటికి నెల్లూరును నెంబర్ వన్ నగరంగా మారుస్తాం: మంత్రి నారాయణ

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 20 Oct 2026 8:15 PM IST
Nellore
X

Nellore: 2028 నాటికి నెల్లూరును నెంబర్ వన్ నగరంగా మారుస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకులు దుండి రాకేష్, మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ సీనియర్ నాయకులు సన్నపురెడ్డి పెంచల రెడ్డి, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ...

2028 డిసెంబర్ నాటికి నెల్లూరు ను భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా మారుస్తానని,ఎన్నికలను అడ్డుకునేందుకు వైసిపి రకరకాల ఎత్తులు వేసిందని, నెల్లూరు కార్పొరేషన్ లోని 72 స్థానాల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు..ఎన్నికల్లో గెలవలేక వైసీపీ ఆరోపణలు చేస్తోందని , ఎన్నికలు జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు రావని అన్నారు.. ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నామని, నెల్లూరు మేయర్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు...

చరిత్ర ఎరుగని, చరిత్ర చూడని అభివృద్ధిని చేసి చూపించింది మంత్రి నారాయణ అని, అమరావతి నిర్మాణంలో మంత్రి నారాయణ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు ..స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరారు... అందరం కలసి కట్టుగా నెల్లూరు మేయర్ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

భవిష్యత్తులో సన్నపురెడ్డి పెంచల రెడ్డి, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి కి మంచి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE