Nellore: నెల్లూరులో ఘనంగా హెచ్‌కే సోలార్ ఎనర్జీస్ లాంచింగ్ కార్యక్రమం!
Nellore: నెల్లూరులో హెచ్‌కే సోలార్ ఎనర్జీస్ ప్రారంభించిన మంత్రి నారాయణ. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌పై ఉచిత ఈవీ బైక్ ఆఫర్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు.
Nellore: నెల్లూరులో ఘనంగా హెచ్‌కే సోలార్ ఎనర్జీస్ లాంచింగ్ కార్యక్రమం!
Nellore: నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పరమేశ్వరి మహేశ్వరి కల్యాణ మండపంలో హెచ్.కే (HK) సోలార్ ఎనర్జీస్ లాంచింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది,ఈ కార్యక్రమానికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు . ముందుగా సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనం చేసి సంస్థను ప్రారంభించడంతో పాటు ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దసరా పండుగ ప్రత్యేక ఆఫర్ కింద సాధారణంగా 2,10,000 అయ్యే 3 కిలోవాట్ల (3 kW) సోలార్ ప్యానెల్ సిస్టమ్‌పై, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000 సబ్సిడీకి అదనంగా HK ఎంటర్‌ప్రైజెస్ వారు 35,000 విలువైన ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీ (EV బైక్) అందిస్తుండటంతో, వినియోగదారులకు 93,000 కే కనెక్షన్ లభిస్తుందని మంత్రి వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గును ఉపయోగించడం వల్ల పెరుగుతున్న కాలుష్యమే ఎల్ నినో వంటి వాతావరణ మార్పులకు, 54% వర్షపాతం తగ్గడానికి ప్రధాన కారణమని సైంటిస్టులు చెప్తున్నారని, దీనిని నివారించడానికే ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి PM సూర్యఘర్ పథకం ద్వారా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ప్రతీ 10-15 రోజులకు జరిగే క్యాబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి సోలార్ ప్రగతిపై సమీక్షిస్తున్నారని, ఇప్పటికే మున్సిపల్ మరియు ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. సోలార్ శక్తిని ఉపయోగించడం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా విద్యుత్ ఖర్చుల్లో 50% కంటే ఎక్కువ ఆదా అవుతుందని తెలుపుతూ, ఈ గ్రీన్ ఎనర్జీ భాగస్వామ్యంలో ముందుకు వచ్చిన సంస్థ నిర్వాహకుడు హరికృష్ణ, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని మరియు రాష్ట్రంలోని ప్రజలందరూ తమ ఇళ్లు, కళ్యాణ మండపాలు, వ్యాపార సంస్థలు మరియు ఇండస్ట్రీలపై సోలార్ ప్యానెల్స్ బిగించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ,పోకలరవి, రాజా నాయుడు,తదితరులు పాల్గొన్నారు.




