Nellore: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ వ్యూహాత్మక ప్రచారం!
Nellore: కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ముమ్మర ప్రచారం. రోడ్‌షోలకు విశేష స్పందన.
Nellore: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ వ్యూహాత్మక ప్రచారం!
Nellore: కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొంగూరు నారాయణ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ అభ్యర్థులతో పాటు జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపునూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కూటమి ధర్మంలో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా 7, 15 డివిజన్లలో మంత్రి నిర్వహించిన రోడ్‌షోలకు కార్యకర్తలు, ప్రజలు అనూహ్యంగా తరలివచ్చారు.
21 వ డివిజన్ ప్రచారంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కూడా పాల్గొన్నారు.స్థానిక మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి, మంగళహారతులతో నేతలకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సిరిగిరి లక్ష్మిని కమలం గుర్తుపై, జనసేన అభ్యర్థులు కెజియా కుమారి, గునుకుల లక్ష్మీలను గాజు గ్లాసు గుర్తుపై, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్‌ను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మంత్రి నారాయణ,ఎంపీ వేమిరెడ్డి ఓటర్లను కోరారు. మిత్రపక్షాల అభ్యర్థుల విజయానికి స్వయంగా ప్రచార బాధ్యతలు తీసుకోవడం ద్వారా కూటమి ఐక్యతను చాటుతున్నారు.




