Nellore: వైసీపీ కుట్రలు ప్రజా తీర్పును అడ్డుకోలేవు

Nellore: వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పును అడ్డుకోలేరని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో స్థానిక ఎన్నికల ఫలితాలపై ప్రసంగం.

V. Narasimhulu, Nellore
Published on: 6 Nov 2026 6:14 PM IST
Nellore
X

Nellore: వైసీపీ కుట్రలు ప్రజా తీర్పును అడ్డుకోలేవు

నెల్లూరు: రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

నేడు నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఎన్డీఏ కూటమి విజయాలు, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యత, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై మాట్లాడారు.

గత నెల రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలకు చేరువైన పాలన అందించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ఎన్డీఏ కూటమి ప్రధాన లక్ష్యమన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని చెప్పారు.

స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు రావాలంటే ఎన్నికలు సజావుగా జరగాలని అన్నారు మంత్రి ఆనం... బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే ఎన్డీఏ కూటమి నిబద్ధత అని, రౌడీయిజం, బెదిరింపులకు భయపడేది లేదని.. రాజకీయాల్లో హద్దులు దాటొద్దని ప్రతిపక్షాన్ని హెచ్చరించారు మంత్రి ఆనం...తన రాజకీయ అనుభవంలో సగం కూడా లేని నాయకులు రాజకీయాలు నేర్పించడానికి వస్తే సహించేది లేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore