Nellore: అభివృద్ధి జాతర: రూ.4 కోట్లతో పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన!

Nellore: నెల్లూరు సిటీ పరిధిలోని 9 డివిజన్లలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 14 Oct 2026 5:34 PM IST
Nellore
X

Nellore: అభివృద్ధి జాతర: రూ.4 కోట్లతో పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన!

Nellore: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర జోరుగా సాగుతుండగా, నేడు 9 డివిజన్లలో రూ. 4 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. కూటమి కమిటీ చర్చలు పూర్తయిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 50 వేల కోట్లు మంజూరు చేశారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వం రాజకీయ కక్షతో ఆపేసిన అభివృద్ధి పనులన్నింటినీ ఇప్పుడు తిరిగి ప్రారంభించామని పేర్కొన్నారు.

నెల్లూరు నగరంలో ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు, సంగం బ్యారేజీ నీటిని అందిస్తామని, అలాగే 800 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయని, జూన్ 12 నాటికి ఆ పనులన్నీ పూర్తి చేసి నెల్లూరును దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పక్కాగా నెరవేరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత,కార్పొరేషన్ ఎస్ఈ జానీ,హెల్త్ ఆఫీసర్ దినేష్ కుమార్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు,మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి,డివిజన్ల కూటమి నేతలు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE