Duthalur: దుత్తలూరు ఏసీ కాలనీలో అర్ధరాత్రి భారీ చోరీ!
Duthalur: నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇంటి ముందు నిద్రిస్తుండగా రూ.40 వేల నగదు, 10 సవర్ల బంగారం, 40 తులాల వెండి అపహరించారు.
Duthalur: దుత్తలూరు ఏసీ కాలనీలో అర్ధరాత్రి భారీ చోరీ!
Duthalur: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని ఏసీ కాలనీలో అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. షేక్ మీరావలి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు.ఇంటి బయట ఉన్న వరండాలో షేక్ మీరావలి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ చోరీ జరిగినట్లు సమాచారం.
ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తీసి అందులోని విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు పేర్కొన్నారు.ఈ చోరీలో సుమారు 10 సవర్ల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.40 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




