Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో మెగా వైద్య శిబిరం: డాక్టర్ మాధవి!

Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో గురువారం మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

A Praveen, Nellore
Published on: 14 Oct 2026 7:36 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో మెగా వైద్య శిబిరం: డాక్టర్ మాధవి!

Nellore: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో ఈ నెల 15వ తేదీ గురువారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఈ శిబిరం ప్రారంభం కానుంది.

ఆసుపత్రిలోని ఐపీ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ హాల్‌లో వైద్య శిబిరానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిబిరం ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, వైద్యుల ద్వారా తగిన వైద్య సలహాలు అందించనున్నారు. ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ఆరోగ్య సమస్యలపై తగిన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెగా వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ కె. మాధవి కోరారు.

A Praveen, Nellore

A Praveen, Nellore