Kaluvai: కలువాయిలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణ!

Kaluvai: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం పూసల కాలనీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

Madhav Goud, Nellore
Published on: 7 Oct 2026 2:13 PM IST
Kaluvai
X

Kaluvai: కలువాయిలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణ!

Kaluvai: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో పూసల కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా పూసల కాలనీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి, ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, బీజేపీ నేత దండు పెంచలయ్య, వైద్య సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore