Nellore: ఎంపీ వేమిరెడ్డి దంపతులను కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్!

Nellore: నెల్లూరు మేయర్‌గా 80 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన రూప్ కుమార్ యాదవ్.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులను కలసి సత్కరించారు.

A Praveen, Nellore
Published on: 4 Nov 2026 1:18 PM IST
Nellore
X

Nellore: ఎంపీ వేమిరెడ్డి దంపతులను కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి 80 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ బుధవారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు.

మేయర్‌గా విజయం సాధించిన అనంతరం తొలిసారిగా వీపీఆర్ దంపతులను కలిసిన రూప్ కుమార్ యాదవ్, ఎన్నికల సమయంలో అన్ని విధాలా అండగా నిలిచి తన విజయానికి సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులను శాలువాలతో సత్కరించారు.

అనంతరం వీపీఆర్ దంపతులు 80 వేలకు పైగా భారీ మెజారిటీతో అద్భుత విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమి నాయకుల సహకారం, మార్గదర్శకత్వంతో నెల్లూరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేయర్‌గా ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore