Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు మేయర్!

Nellore: నెల్లూరు నగర మేయర్‌గా 80 వేల పైచిలుకు భారీ మెజార్టీతో గెలిచిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

A Praveen, Nellore
Published on: 4 Nov 2026 1:16 PM IST
Nellore
X

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నెల్లూరు మేయర్!

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 80 వేల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించిన అనంతరం నెల్లూరు మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తన ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందించిన సహకారం, చూపిన ప్రోత్సాహం, అందించిన అండదండలు మరువలేనివని రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకుల మధ్య ఆత్మీయత, పరస్పర గౌరవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

A Praveen, Nellore

A Praveen, Nellore