Gudur: గూడూరులో జ్యువెలరీ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక దాడులు. కోట్ల విలువైన అక్రమ బంగారం, వెండి సీజ్. వ్యాపారుల్లో కలకలం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 10:01 AM IST
Gudur
X

Gudur: గూడూరులో జ్యువెలరీ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు!

Gudur: నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు చెందిన అధికారులు గూడూరు లోని పలు బంగారం దుకాణాలపై ఆకస్మికంగా దాడులు చేశారు, ఈ దాడుల్లో లెక్కలు చూపకుండా అనధికారికంగా నిల్వ ఉన్న కోట్ల రూపాయలు విలువచేసే కేజీల కొద్ది బంగారం, వెండిని కనుగొన్నారు, ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొందరు బంగారం దుకాణాలు నిర్వహిస్తున్న వారు చట్టబద్ధంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన జీఎస్టీ మరి ఇతర పన్నులు చెల్లించకుండా అక్రమంగా వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కే. శ్రీనివాసరావుకు అందిన సమాచారం మేరకు వారి ఆదేశాలతో తాము గూడూరు పట్టణంలోని మానస జ్యువెలరీ, నికిత జ్యువెలరీ, శ్రావణ జ్యువెలరీ దుకాణాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా వారి రికార్డులలో చూపిన బంగారం వెండి నిల్వలకు సంబంధం లేకుండా కేజీల కొద్దీ బంగారు వెండి నిల్వలో వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించామని ఆ వివరాలు ప్రకారం ఓ షాపులో 4 కేజీల బంగారం ఎక్కువగాను,3.5 కిలోల వెండి ఎక్కువగానూ,, మరో దుకాణంలో 1.5 కేజీల బంగారం తక్కువగాను, 12 కేజీల వెండి ఎక్కువగాను, మరో షాపులో 1.2 కేజీల వెండి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి.

ఈ బంగారం వెండిని సీజ్ చేసామని, ఈ వ్యత్యాసం ఉన్న నిల్వలకు సంబంధించి వారం లోపు సరైన రికార్డులు చూపించి తేడాలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని, లేనియెడల జీఎస్టీ, సేల్ టాక్స్ ఎగ్గొట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్నందుకుగాను చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఇదే సమయంలో గూడూరులోని అనేక బంగారం దుకాణాల్లో వినియోగదారులను మోసం చేసే విధంగా 24 క్యారెట్ల బంగారం పేరు చెప్పి 18 క్యారెట్ల బంగారాన్ని అమ్మేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని బంగారం వ్యాపారులు చట్టానికి లోబడి నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలని వినియోగదారులను ప్రభుత్వాన్ని మోసం చేస్తే షాపులు సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలియజేశారు.

ఎవరు ఈ మానస జ్యువెలరీ, నికిత జువెలరీ,శ్రవణ జ్యువెలరీ యజమానులు??, ఎలా వీరిని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం వెండి అక్రమంగా నిల్వ చేశారు??, వీరికి అక్రమ బంగారం వెండి ఎలా వస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా గూడూరు బంగారం దుకాణాల్లో మోసాలు చేస్తున్నారు. చట్టబద్ధంగా బంగారం కొనుగోలు చేయకుండా అడ్డదారుల్లో బంగారం కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వాలను ఎలా మోసం చేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం పేరుతో 18 క్యారెట్ల బంగారం ఎలా అమ్మేస్తున్నారు ప్రభుత్వ అధికారులు కనుగొన్న అక్రమ నిల్వలు గోరంత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్