Marripadu: పేకాట స్థావరంపై దాడి: ముగ్గురు అరెస్ట్, నగదు స్వాధీనం
Marripadu: మర్రిపాడు మండలం అల్లంపాడులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.19,650 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Marripadu: పేకాట స్థావరంపై దాడి: ముగ్గురు అరెస్ట్, నగదు స్వాధీనం
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలంలోని అల్లంపాడు గ్రామంలో పేకాట స్థావరంపై మర్రిపాడు ఎస్సై బలరాం రెడ్డి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. .19,650 నగదుతో పాటు పేకముక్కలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై బలరాం రెడ్డి మాట్లాడుతూ.. మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పదేపదే నేరాలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరిచి ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ప్రజల ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలియజేశారు.




