Kaligiri: కలిగిరి మండలం దూబగుంటలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి!

Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంటలో పిడుగుపాటుకు గురై తలపల రామారావు (45) మృతి. గుడిసెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వైనం!

V. Kamaiah, Vinjamuru
Published on: 19 Sept 2026 9:21 AM IST
Kaligiri
X

Kaligiri: కలిగిరి మండలం దూబగుంటలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి!

Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దుబగుంట గ్రామం ST కాలనీలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలపల రామారావు (45) పిడుగుపాటుకు గురై మృతి చెందారు.ఉదయం వర్షం కురుస్తున్న సమయంలో రామారావు తాటాకుల గుడిసె ఇంట్లో ఉండగా పిడుగు పడినట్లు స్థానికులు తెలిపారు.

పిడుగు ప్రభావంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.మృతుడు రామారావుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru