Nellore: మల్లాం బ్రహ్మోత్సవాలు: సాంబారు పడి 12 మందికి గాయాలు!
Nellore: నెల్లూరు జిల్లా మల్లాం బ్రహ్మోత్సవాలలో అపశృతి. అన్నదానం వద్ద ఉడుకుతున్న సాంబారు పడి 12 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.
Nellore: మల్లాం బ్రహ్మోత్సవాలు: సాంబారు పడి 12 మందికి గాయాలు!
Nellore: నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లాంలో బ్రహ్మోత్సవాల వేళ అపశృతి చోటు చేసుకుంది. కళ్యాణోత్సవం సందర్భంగా భారీ అన్నదానానికి ఏర్పాట్లు చేస్తుండగా అన్నదానం తయారీ కేంద్రం వద్ద పెద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది .మల్లాం బ్రహ్మోత్సవాలలో కళ్యాణం సందర్భంగా భక్తులకు భారీ అన్నదానం చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నదానం కోసం సాంబారు భారీగా ఉడికిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఉడుకుతున్న సాంబారు పాత్ర ఒలికి పడిపోయింది. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందిపై వేడి సాంబారు మీద పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, ఆలయ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన 12 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించినట్లు సమాచారం. ప్రతి ఏటా మల్లాం బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. కళ్యాణం రోజున భారీ అన్నదానం చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి అన్నదాన ఏర్పాట్లలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదంపై ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు.




