Gudur: స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం: పట్టణ అధ్యక్షుడు దయాకర్

Gudur: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు మున్సిపాలిటీలో బీజేపీ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పట్టణ అధ్యక్షుడు కే. దయాకర్ పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Oct 2026 6:14 PM IST
Gudur
X

Gudur: స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం: పట్టణ అధ్యక్షుడు దయాకర్

గూడూరు: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గూడూరు పట్టణ పరిధిలో బీజేపీని మరింత బలోపేతం చేసి, ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని గూడూరు పట్టణ బిజెపి అధ్యక్షులు కే దయాకర్ పిలుపునిచ్చారు. ఆదివారంగూడూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇటీవల చెన్నూరు, నెలటూరు, పొటిపాళెం, పురిటిపాళెం, చిల్లకూరు తదితర గ్రామాలు గూడూరు మున్సిపాలిటీ పరిధిలోకి చేరిన నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా సిద్ధం చేయడంపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. కొత్తగా మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహంపై నాయకులు చర్చించారు.

అదేవిధంగా ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో, జిల్లా కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ శివాలయం చైర్మన్ బాలకృష్ణ నాయుడు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రరెడ్డి, కిసాన్ మోర్చా కోస్తా ఆంధ్ర జోనల్ ఇన్‌చార్జ్ అభిలాష్ రెడ్డి, సీనియర్ నాయకులు కోటారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ప్రకాష్ నాయుడు, గూడూరు రూరల్ ఇన్‌చార్జ్ బైరప్ప, గూడూరు రూరల్ అధ్యక్షులు నరేంద్ర, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మధిర సునీల్, మండల ప్రధాన కార్యదర్శి రవీంద్ర, మండల ఉపాధ్యక్షులు సురేష్ బాబు, శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ అధ్యక్షులు సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బాలమణి, పట్టణ కార్యదర్శి భార్గవ్, పట్టణ కోశాధికారి నిరంజన్, పట్టణ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి భవాని తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్