Gudur: గూడూరు కోర్టు సంచలన తీర్పు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Gudur: గూడూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొమ్మ రాజశేఖర్ హత్య కేసులో గడి రామయ్య, కిష్టయ్యలకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ ఏడవ అదనపు జిల్లా జడ్జి తీర్పు చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 7:18 PM IST
Gudur
X

Gudur: గూడూరు కోర్టు సంచలన తీర్పు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

గూడూరు: గూడూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఏపీపీ వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కోట మండలం చిట్టెడు గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్ ఏ వన్ ముద్దాయి గడి రామయ్య కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడని అతనిపై కోపంతో గడి రామయ్య అతని సోదరుడికిష్టయ్య ఇద్దరు 2018 జూన్ నెలలో రాజశేఖర్ ను హత్య చేశారని తెలిపారు.

కేసు విచారణ పూర్తయి నేడు ఏడవదనప జిల్లా జడ్జ్ ఇద్దరి ముద్దాయిలకు జీవిత ఖైదు ఒక్కొక్కరికి 25వేల రూపాయల జరిమానా విధించారని వెల్లడించారు ఈ కేసులో సకాలంలో పోలీసులు సాక్షాలను కోర్టు ముందు ఉంచారని పేర్కొన్నారు మీ సమావేశంలో లిజనింగ్ ఆఫీసర్ మల్లికార్జునరావు ,అనిల్ బాబు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్