Nellore: మంత్రి నారాయణకు కృతజ్ఞతల వెల్లువ: నెల్లూరులో భారీ గెలుపు

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్‌లో 2888 ఓట్ల భారీ మెజారిటీ సాధించిన సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను నాయకులు ఘనంగా సత్కరించారు.

A Praveen, Nellore
Published on: 7 Nov 2026 4:39 PM IST
Nellore
X

Nellore: మంత్రి నారాయణకు కృతజ్ఞతల వెల్లువ: నెల్లూరులో భారీ గెలుపు

నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్‌లో టీడీపీకి 2888 ఓట్ల భారీ మెజారిటీ సాధించిపెట్టిన ప్రజలకు, అందుకు కృషి చేసిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు డివిజన్ టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నారాయణను కలిసిన కార్పొరేటర్ కుటుంబసభ్యులు కిన్నెర ప్రసాద్,కిన్నెర ప్రేమ్ టీడీపీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు.

17 వ డివిజన్ లో 2842 ఓట్ల మెజారిటీ సాధించిన కార్పొరేటర్ కాకర్ల తిరుమల నాయుడు డివిజన్ వాసులతో కలిసి వచ్చి మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కిన్నెర ప్రసాద్ మాట్లాడుతూ 10వ డివిజన్‌లో ప్రజలు 2888 ఓట్ల అత్యధిక మెజారిటీని అందించి తమపై నమ్మకాన్ని చాటుకున్నారన్నారు.

మంత్రి నారాయణ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నగరవాసులు స్వాగతించారని, ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, కుమార్తెలు సింధూర, షరణి,అల్లుడు పునీత్ నిర్వహించిన ప్రచారం తమ విజయానికి మరింత బలాన్నిచ్చిందన్నారు. వారి ప్రచారంతో అన్ని డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు లభించాయని పేర్కొన్నారు.నెల్లూరు నగర ప్రజలంతా మంత్రి నారాయణ

వెంటే ఉన్నారని పురపాలక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి మంత్రి రుణం తీర్చుకుంటామమన్నారు.తమ విజయానికి సహకరించిన మంత్రి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore