Gudur: గూడూరులో బిజెపిలో చేరిన కుందుర్తి కృష్ణయ్య!

Gudur: తిరిగి బిజెపిలో చేరిన లోక్‌సత్తా మాజీ అభ్యర్థి కుందుర్తి కృష్ణయ్య. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీనియర్ నాయకుడు పనబాక కోటేశ్వరరావు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2026 10:38 AM IST
Gudur
X

Gudur: గూడూరులో బిజెపిలో చేరిన కుందుర్తి కృష్ణయ్య!

Gudur: గూడూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూర్చేలా కుందుర్తి వెంకట కృష్ణయ్య బీజేపీలో చేరారు. ఆదివారం ఉదయం 10:00 గంటలకు గూడూరులోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కే. దయాకర్, బీజేపీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పనబాక కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఆయనకు పనబాక కోటేశ్వరరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

అనంతరం బిజెపిలో చేరిన కుందుర్తి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ.. గతంలో కూడా బీజేపీలో చాలాకాలం పనిచేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశానని తెలిపారు. వ్యక్తిగత పనుల కారణంగా కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానని, తిరిగి ఇప్పుడు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. 2009లో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా లోక సత్తా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 5660 ఓట్ల కు పైగా సాధించానని జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కే. దయాకర్, సీనియర్ నాయకులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్ద శివాలయం చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి బాలకృష్ణ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్ యాదవ్, రూరల్ మండల అధ్యక్షుడు కే. నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్