Gudur: ఆకలి తీర్చడమే లక్ష్యం: కృప సేవా చారిటబుల్ ట్రస్ట్

Gudur: చిల్లకూరు మండలం పురిటిపాలెం ఎస్టీ కాలనీలో నిరుపేద గిరిజనులకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెజిటబుల్ బిర్యానీ, పండ్లను పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Oct 2026 6:01 PM IST
Gudur
X

Gudur: ఆకలి తీర్చడమే లక్ష్యం: కృప సేవా చారిటబుల్ ట్రస్ట్

Gudur: శనివారం గూడూరు చిల్లకూరు మండలం పురిటి పాలెం ఎస్టీ కాలనీలో ఉన్న నిరుపేదలకు కుటుంబాలకు మంచి రుచికరమైన వెజ్ టేబుల్ బిర్యాని అరటిపండు వాటర్ బాటిల్ పంపిణీ.. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ సేవ ఉద్దేశం "మానవ సేవయే మాధవ సేవ అంటారు.

సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడటమే అసలైన మానవత్వం. మా ట్రస్ట్ ఎప్పుడూ కూడా పేద ప్రజలకు, వెనుకబడిన వర్గాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే పనిచేస్తోంది. ప్రతినెల రెండో శనివారం తప్పకుండా మా ట్రస్ట్ సభ్యుడు" సుద్ద రాసి పెంచలయ్య" మాధవి" దంపతులు సహకారముతో అన్నదానం అనేది అన్ని దానాల కన్నా మిన్న అయింది.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే పెద్ద పుణ్యం మరొకటి లేదు. ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే అనే భావనతో" ప్రేమతో ఈ గిరిజనులకాలనీ ప్రజలకు భరోసా"ఇది కేవలం ఒకరోజు వచ్చి అన్నం పెట్టి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు.

మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ఇతర అవసరాలకు మా శక్త్యనుసారం తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు,ఉపాధ్యక్షుడు అత్తి మంజరి గోపాల్, పేయ్యల రమణయ్య, చవల సురేంద్ర, కసుకుర్తి కోటేశ్వరరావు, కోడి శివ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్