Nellore: కోవూరు కాలువపై నూతన బ్రిడ్జిలకు శంకుస్థాపన!
Nellore: కోవూరు కాలువపై 30 ఏళ్ల నిరీక్షణకు తెర: దామరమడుగు, కాగులపాడుల్లో రూ.1.79 కోట్లతో నూతన బ్రిడ్జిల నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన.
Nellore: కోవూరు కాలువపై నూతన బ్రిడ్జిలకు శంకుస్థాపన!
నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో 30 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలకు పునర్జీవం లభించింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, కాగులపాడు గ్రామాల్లో కోవూరు కాలువపై నూతన బ్రిడ్జిల నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. దామరమడుగు బ్రిడ్జికి రూ.90 లక్షలు, కాగులపాడు బ్రిడ్జికి రూ.88.99 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, కాగులపాడు గ్రామాల్లో కోవూరు కాలువపై నూతన బ్రిడ్జిల నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు.
దామరమడుగు గ్రామంలో రూ.90 లక్షలు, కాగులపాడు గ్రామంలో రూ.88.99 లక్షలతో బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపడుతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ... తాను బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కలలు కన్నానని, నేడు ఆ కలను నిజం చేస్తూ కోవూరు కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.
గత 30 సంవత్సరాలుగా ఈ రెండు బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. బ్రిడ్జిలు దెబ్బతినడంతో ఆయా గ్రామాల మీదుగా ప్రయాణించే ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేడు బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే రైతులు తమ పంటలు, ధాన్యాన్ని మార్కెట్లకు సులభంగా తరలించేందుకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో సుమారు రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
అలాగే జి.రాంజీలో రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అక్కడ కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల నాయకులు, కూటమి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




