Kovur: బుచ్చిరెడ్డిపాళెంలో రూ.3 కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!

Kovur: బుచ్చిరెడ్డిపాళెంలో రూ.3 కోట్ల పనులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన వివక్ష లేకుండా అభివృద్ధి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డుల్లో కూటమి గెలవాలని పిలుపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Sept 2026 9:29 PM IST
Kovur
X

Kovur: బుచ్చిరెడ్డిపాళెంలో రూ.3 కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన!

కోవూరు: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో రూ.3 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితం కాదు.. పనులను ప్రారంభించి పూర్తి చేస్తుంది హ్యామ్ స్కీమ్ కింద రూ.22 కోట్లు మంజూరు. బుచ్చి మున్సిపాలిటీలో మౌలిక వసతులకు ఇప్పటివరకు రూ.58 కోట్లు వ్యయం, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బుచ్చిలోని 28 వార్డుల్లోనూ కూటమి విజయం సాధించాలి.

గత ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో వివక్ష చూపించిందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను చేపడుతోందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో ప్రగతి పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 15, 18వ వార్డుల్లో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురుగు నీటి డ్రైన్ల నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి శనివారం ఆమె ఘనంగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యేగారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

పనులు ప్రారంభించి పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ నైజం

కూటమి ప్రభుత్వం కేవలం టెంకాయలు కొట్టి వదిలేసే ప్రభుత్వం కాదని, గుమ్మడికాయలు కొట్టి పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తేల్చిచెప్పారు. బుచ్చి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన కోసం హ్యామ్ (HAM) స్కీమ్ కింద రూ.22 కోట్లు మంజూరయ్యాయని, రాబోయే ఏడాది కాలంలో ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు మొత్తం రూ.58 కోట్ల విలువైన అభివృద్ధి పనులను వెచ్చించామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో అభివృద్ధి నిధుల కేటాయింపులో ఎక్కడా వెనకాడటం లేదని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో 28కి 28 వార్డులూ గెలవాలి.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను ఘన విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డుల్లో ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు ధైర్యంగా ప్రశ్నించవచ్చని, స్థానిక స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్