Sangam: సంగం శివాలయంలో కోటి సోమవారం వేడుకలు.. దీపాల కాంతులు!

Sangam: కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధన ఘనంగా జరిగాయి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 16 Nov 2026 6:57 PM IST
Sangam
X

Sangam: సంగం శివాలయంలో కోటి సోమవారం వేడుకలు.. దీపాల కాంతులు!

Sangam: కార్తీక మాసం కోటి సోమవారం సందర్భంగా నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో వెలసివున్న శివాలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు.

భక్తులు శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ ప్రాంగణం మొత్తం దీపాల కాంతులతో వెలిగిపోయింది. భక్తులు ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. శివనామస్మరణతో సంగం శివాలయం మార్మోగిపోయింది.కార్తీక మాసంలో కోటి సోమవారం రోజున శివుడిని దర్శించుకుంటే కోటి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేకంగా దీపాలు వెలిగించి, పూజలు చేసి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించారు.భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తీర్థ ప్రసాదాలు కూడా పంపిణీ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)