Kondapuram: తిమోతి కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని రామారావు

Kondapuram: కొండాపురం మండల టీడీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పదార్ల తిమోతి మృతి పట్ల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకట రామారావు సంతాపం తెలిపారు.

V. Kamaiah, Vinjamuru
Published on: 26 Sept 2026 4:57 PM IST
Kondapuram
X

Kondapuram: తిమోతి కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని రామారావు

Kondapuram: కొండాపురం మండల టీడీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పదర్ల తిమోతి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పరామర్శించారు. కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోని తిమోతి నివాసానికి వెళ్లిన బొల్లినేని వెంకట రామారావు ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

తిమోతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా తిమోతి తెలుగుదేశం పార్టీ కోసం చేసిన సేవలను బొల్లినేని వెంకట రామారావు గుర్తు చేసుకున్నారు.పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారని తెలిపారు.ఆయన మృతి పార్టీకి,కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు.

తిమోతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బొల్లినేని వెంకట రామారావు భరోసా ఇచ్చారు.ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. తిమోతి ఆత్మకు శాంతి చేకూరాలని,ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru