Vinjamur: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు కోడే వెంకటరావు ట్రస్ట్ సాయం!

Vinjamur: వింజమూరు ప్రాంతంలోని కొమ్మి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నమ్మకు కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసింది.

V. Kamaiah, Vinjamuru
Published on: 5 Oct 2026 1:30 PM IST
Vinjamur
X

Vinjamur: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు కోడే వెంకటరావు ట్రస్ట్ సాయం!

Vinjamur: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని హరిజనవాడకు చెందిన యారాం చిన్నమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ చిన్నమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించి,ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా చెరుకూరి నవీన్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేదలు,నిరుపేదలు అనారోగ్యం లేదా ఇతర ఆపదల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయం అందించేందుకు ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య,బూత్ ఇన్‌చార్జీలు చెరుకూరి శేషయ్య, శ్రీను,చెరుకూరి వెంకయ్య, కొండలరావుతో పాటు టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru