Kavali: కావలి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో కూటమి హోరు!
Kavali: కావలి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌కు ఓట్లు అభ్యర్థించారు.
Kavali: కావలి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో కూటమి హోరు!
కావలి: కావలి మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకోవడంతో చివరి రోజు కూటమి నేతలు పట్టణంలో అత్యంత ఉత్సాహంగా, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పట్టణంలోని 36, 35, 4 మరియు 9వ వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేశారు.
చివరి రోజు ప్రచారానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆయా వార్డుల ప్రజలు, కూటమి కార్యకర్తలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలకగా, యువత, కార్యకర్తల నినాదాలతో వార్డులన్నీ హోరెత్తాయి.రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కావలి పట్టణ సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కూటమి అభ్యర్థుల విజయం ఎంతో అవసరమన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న భరత్ కుమార్‌ను, 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




