Kaluvoya: ప్రభుత్వ రాయితీలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
Kaluvoya: కలువాయి వెటర్నరీ ఆసుపత్రిలో పశుసంవర్ధక శాఖ అవగాహన సదస్సు. పశువుల ఇన్సూరెన్స్, పశుగ్రాసం రాయితీలను రైతులు వినియోగించుకోవాలని జేడీ రమేష్ నాయక్ సూచన.
Kaluvoya: ప్రభుత్వ రాయితీలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కలువాయి: పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జేడి రమేష్ నాయక్ తెలిపారు, నెల్లూరు జిల్లా కలువాయి మండలం పశువైద్యశాలలో కలువాయి, చేజర్ల, మండలాల వెటర్నరీ సిబ్బందికి ప్రభుత్వ పథకాలపై అవగాహనసదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులు గడ్డి పెంచుకొనేందుకు, గోకులం షెడ్ లు నిర్మించుకునేందుకు, వీ,బీ,జీ,రాంజీ ద్వారా రైతులను ప్రోత్సాహిస్తుందన్నారు,ఎలినో ప్రభావంతో గడ్డి కొరత ఉన్నందున, పొలం లేని రైతులు గడ్డికి ఇబ్బందులు పడకుండా పొదుపు గ్రూపులో సహకారంతో పొలం వుండి గేదెలు లేని రైతుల పొలంలో గడ్డిని పెంచి ఇవ్వటం జరుగుతుందన్నారు.
వెటర్నరీ సిబ్బంది గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు,మన జిల్లాకు 18 లక్షలు పశువులు ఇన్సూరెన్స్ కోసం మంజూరు అయ్యాయన్నారు, గతంలో మూడు సంవత్సరాలకు ఇన్సూరెన్స్ ఉండేదన్నారు.
ఇప్పుడు ప్రతి సంవత్సరం చేయించుకోవాలన్నారు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాడి రైతులు సంక్షేమం కోసం అనేక రాయితీలు కల్పిస్తుందన్నారు, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు,ఈ కార్యక్రమం లో డి, యల్, డి, ఏ శ్రీనివాసులు, ఎడీలు, సుబ్రమణ్యం, అరుణ, డాక్టర్ లు, రాజేష్, కృష్ణ ప్రసాద్, రెండు మండలాల సిబ్బంది పాల్గొన్నారు.




