Nellore: తెలుగుదేశం పార్టీ నా పుట్టిల్లు.. దుష్ప్రచారం తగదు.. కలువాయి ఎంపీపీ!
Nellore: తెలుగుదేశం పార్టీ తన పుట్టిల్లు అని, పార్టీ ఆదేశం శిరోధార్యమని నెల్లూరు జిల్లా కలువాయి మండల అధ్యక్షుడు, ఎంపీపీ చల్లా రఘు రామిరెడ్డి స్పష్టం చేశారు.
Nellore: తెలుగుదేశం పార్టీ నా పుట్టిల్లు.. దుష్ప్రచారం తగదు.. కలువాయి ఎంపీపీ!
Nellore: తెలుగు దేశం పార్టీ నా పుట్టిల్లు అని పార్టీ ఆదేశం నాకు శిరోధార్యమని నెల్లూరు జిల్లా కలువాయి మండల అధ్యక్షులు చల్లా రఘు రామిరెడ్డి చెప్పారు. కలువాయి లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు,వెబ్ న్యూస్ పేపర్ నాపై దుష్ప్రచారం చేస్తోందని అయన తీవ్రంగా ఖండించారు.
ఎంపీపీ పదవి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఎన్ డి సి సి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, పరిశీలకులు బాలకృష్ణ చౌదరి, ఎంపీటీసీలు, ప్రజల సహకారం తో వచ్చిందని ఏవరో నాకు ఇచ్చారని ప్రచారం చేయడం వారికి తగదని చెప్పారు.
సర్పంచ్, వార్డు సభ్యులు పోటీలో తన ప్రమేయం ఏమి లేదని స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికీ వారే స్వయంగా పోటీ కి నామినేషన్ లు వేసుకొన్నారని తెలిపారు,పోటీ వేసిన వారు తన మద్దత్తు కోరారని తెలిపారు,టీడీపీ లో కొద్దరు వైసీపీ నాయకులు మద్దత్తుతో నామినేషన్ లు వేసుకొన్నారని అయన తెలియజేసారు.




