Kaluvalay: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డిని కలిసిన కలువాయి కూటమి ఎంపీటీసీలు, జడ్పీటీసీ

Kaluvalay: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసిన కలువాయి మండల విజేతలు 11 మంది కూటమి ఎంపీటీసీలు, జడ్పీటీసీ అభ్యర్థి లిఖిత. ప్రత్యేక అభినందనలు.

Madhav Goud, Nellore
Published on: 8 Nov 2026 8:29 PM IST
Kaluvalay
X

Kaluvalay: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డిని కలిసిన కలువాయి కూటమి ఎంపీటీసీలు, జడ్పీటీసీ

కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన 11 మంది కూటమి ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ అభ్యర్థి అరవ లిఖిత,నేడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, కలువాయి–రాపూరు మండలాల ఇంచార్జి మెట్టుకూరు ధనుంజయ రెడ్డి కూడా పాల్గొని విజేతలకు అభినందనలు తెలియజేశారు.

ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మండల రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిన కలువాయి బిట్‌–1 ఎంపీటీసీ స్థానంపై నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సెగ్మెంట్‌పై రాజకీయ వర్గాల్లో మొదటి నుంచి ఆసక్తి నెలకొంది,ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రఘురామిరెడ్డి సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా అభినందించారు, మండలంలోని మిగిలిన స్థానాల్లో విజయం సాధించిన కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కలువాయి మండల ఎన్నికల అబ్జర్వర్ బాలకృష్ణ చౌదరి, సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్, వెంకటేశ్వర్ నాయుడు, కిషోర్ రెడ్డి, డాక్టర్ రాజేష్‌, పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore