Kaluvalai: ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత.. ఆర్వోకు జనసేన ఫిర్యాదు!
Kaluvalai: కలువాయి MPDO కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన రసాభాస. వైసీపీ అభ్యర్థుల ఆమోదంపై జనసేన అభ్యర్థి రామారావు నిరసన, ఆర్డీవోకు అప్పీల్‌కు సిద్ధం.
Kaluvalai: ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత.. ఆర్వోకు జనసేన ఫిర్యాదు!
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ ల పరిశీలన జరిగింది.మండలంలో ని కుల్లూరు సెగ్మెంట్ వైసీపీ అభ్యర్థులు మద్దెల రోశిరెడ్డి, నర్సింగ్ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ నామినేషన్ లపై జనసేన పార్టీ అభ్యర్థి మాలే రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి నిధులు వైసీపీ అభ్యర్థులు ఇద్దరు స్వాహా చేసారని ఆ విషయాన్ని నామినేషన్ పత్రం లో నమోదు చేయలేదని ఆర్ ఓ సుబ్బరాజు కు ఆధారాలతో పిర్యాదు చేశారు. అయినా ఆర్ ఓ వారి నామినేషన్ లను ఆమోదించారు.
జనసేన పార్టీ అభ్యర్థి రామారావు ఆర్ ఓ ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తాను ఇచ్చిన పిర్యాదు కు లిఖిత పూర్వకం గా రాసి ఇవ్వాలని జనసైనికులు కార్యాలయంలో కూర్చున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్ ఓ జనసేన అభ్యర్థి కి పిర్యాదు రాసి ఇచ్చారు. ఈ నివేదికలను ఆత్మకూరు ఆర్ డి ఓ, జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేస్తామని పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా చర్యలు చేపట్టారు.




