Kaluvay: తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు నిరసన!

Kaluvay: తమ పట్టా భూమికి దారి లేక నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు దంపతులు నిరసన చేపట్టారు. పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.

Madhav Goud, Nellore
Published on: 12 Oct 2026 12:15 PM IST
Kaluvay
X

Kaluvay: తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు నిరసన!

Kaluvay: నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం ముందు న్యాయం కోసం రైతు దంపతులు రోడ్డెక్కారు.. తమ పట్టా పొలానికి దారి లేకుండా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మాదనగారిపల్లి గ్రామానికి చెందిన గోమసాని రామయ్య, ఆయన భార్య లక్ష్మీ లావణ్య కలువాయి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

తమ కుటుంబానికి సర్వే నంబర్ 192లో ఐదు ఎకరాల వరకు పట్టా భూమి ఉందని, అదే గ్రామానికి చెందిన మరో రైతు సర్వే నంబర్లు 207, 208, 211 పరిధిలో సుమారు పది ఎకరాల భూమిని ఆక్రమించి తమ పొలానికి వెళ్లే దారి లేకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు.

తమ భూమికి వెళ్లేందుకు రెండుసార్లు చదును చేసుకున్నా, రాత్రికి రాత్రే తిరిగి దున్నేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని వాపోయారు.

ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే నిరసనకు దిగాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు,తమ పట్టా భూమికి దారి లేకపోతే సాగు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమి సమస్యను పరిష్కరించి, పట్టా పొలానికి దారి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన తహసీల్దార్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల్లో సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore