Nellore: జర్నలిస్టుల కోరికల దినోత్సవం: గాంధీ విగ్రహానికి వినతిపత్రం

Nellore: జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లోని బాపూజీ విగ్రహానికి APUWJ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.

A Praveen, Nellore
Published on: 2 Oct 2026 4:03 PM IST
Nellore
X

Nellore: జర్నలిస్టుల కోరికల దినోత్సవం: గాంధీ విగ్రహానికి వినతిపత్రం

నెల్లూరు: జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే (APUWJ) రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నెల్లూరులో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నెల్లూరు జిల్లా APUWJ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, మీడియా ప్రతినిధులకు అవసరమైన సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, APUWJ ప్రతినిధులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore