Nellore:'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు!
Nellore: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నెల్లూరులో 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు
Nellore:'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు!
Nellore: దేశ ప్రగతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన దమ్మున్న నాయకుడు, భారత గౌరవాన్ని విశ్వవేదికపై మరింత ఉన్నతంగా నిలబెడుతున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు జనసేన నేతలు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు “సేవా సంకల్ప్ అభియాన్”లో భాగంగా, జనసేన నాయకులు కిషోర్ గునుకుల సతీమణి, ఏఎంసీ డైరెక్టర్ వీరమహిళ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుర్రాలమడుగు సంఘం వద్ద, పుట్ట వద్ద గల హనుమాన్ స్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా దీపాలు వెలిగించి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశ అభివృద్ధి, ఆత్మనిర్భరతతో పాటు ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం ప్రత్యేక ముద్ర వేసిందని పేర్కొన్నారు.
భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత శిఖరాలకు చేర్చే లక్ష్యంతో సాగుతున్న ఆయన సేవా ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని, దేశం మరింత అభివృద్ధి, శాంతి, సుసంపన్నత వైపు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, మరింత శక్తి ప్రసాదించాలని హనుమంతుడిని ప్రార్థిస్తూ, దేశ సేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు.




