Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు 21వ డివిజన్ లో జనసేన ప్రచారం ముమ్మరం!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు 21వ డివిజన్ జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల విజయానికి ముమ్మర ప్రచారం. గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 19 Oct 2026 4:43 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు 21వ డివిజన్ లో జనసేన ప్రచారం ముమ్మరం!

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో, 21వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల విజయమే లక్ష్యంగా జనసేన నాయకులు గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ఆదివారం కూడా ఉత్సాహంగా కొనసాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, కావలి జనసేన నాయకులు అలహరి సురాధర్ పాల్గొని, స్థానిక ప్రజలు, కుటుంబాలతో మమేకమై కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

నగరంలోని 72 డివిజన్లలో కూటమి అభ్యర్థులను, కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ ని గెలిపించడం ద్వారా నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 21వ డివిజన్‌లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న విజయలక్ష్మి గునుకులను ఆదరించి, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల, అలహరి సురాధర్, ప్రశాంత్ గౌడ్ మడపర్తి, ప్రశాంత్ గౌడ్, వీరమహిళలు ఆమని, ప్రవల్లిక, సుప్రియ, విజయ, శ్రీలక్ష్మి, కృష్ణవేణి తదితరులతో పాటు జనసేన నాయకులు నాగేంద్ర బాలు, బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, నరహరి, విశ్వనాథ్, సుమంత్, రాజేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE