Nellore: నెల్లూరు లక్ష్మీనగర్‌లో జనసేన ఘనంగా 'డోర్ టు డోర్' ప్రచారం!

Nellore: నెల్లూరు లక్ష్మీనగర్‌లో జనసేన నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి, కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు.

A Praveen, Nellore
Published on: 13 Oct 2026 2:00 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు లక్ష్మీనగర్‌లో జనసేన ఘనంగా 'డోర్ టు డోర్' ప్రచారం!

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్) ప్రాంతంలో గత నెల రోజులుగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులను గెలుపుకై జనసే నిర్వహిస్తున్న డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈరోజు లక్ష్మీనగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు ప్రతి గడపను పలకరిస్తూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వ్యూహాత్మక నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్న మార్పులు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించి, డివిజన్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

చంద్రబాబు నాయుడు గారి విజన్‌కు అనుగుణంగా ఉద్యోగాల సృష్టి, స్వయం ఉపాధి పథకాలు, యువతకు అవకాశాలు, భవిష్యత్ తరాలకు బలమైన పునాది వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని నాయకులు వివరించారు. ప్రతిష్ఠాత్మక రాజధాని నిర్మాణంతో పాటు, నాయకత్వం అంటే ప్రజాసేవ, బాధ్యత, అభివృద్ధి దిశగా నడిపించడం అని పొంగూరి నారాయణ గారు రోల్ మోడల్‌గా చూపిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను స్వీకరిస్తూ సాగిన ఈ ప్రచార కార్యక్రమానికి స్థానికుల నుంచి సానుకూల స్పందన లభించింది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమికి తమ మద్దతు ఉంటుందని పలువురు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మీ గునుకుల,విజయ, ప్రవల్లిక, కల్పన, కృష్ణవేణి, సుప్రియ, నాగేంద్రబాలు, నరహరి, ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, బాలాజీ, ఆమని తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కూటమి బలోపేతం కావాలి… ప్రజల ఆశయాల సాధనే మా లక్ష్యం!

A Praveen, Nellore

A Praveen, Nellore