Nellore: నెల్లూరులో జనసేన నాయకుల ప్రజా చైతన్య యాత్ర!
Nellore: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.
Nellore: నెల్లూరులో జనసేన నాయకుల ప్రజా చైతన్య యాత్ర!
Nellore: రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, రానున్న నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి నగర అభివృద్ధికి మరింత బాటలు వేయాలని జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం, పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలనకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు.
నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్) పరిధిలోని లక్ష్మీనగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతాల్లో వారు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలుసుకున్నారు. ప్రతి గడపను పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో నగరం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చారిత్రాత్మక రాజధాని నిర్మాణంతో పాటు నెల్లూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో పాటు, నెల్లూరు నగర అభివృద్ధి, సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోందని పేర్కొన్నారు. “నమ్మకం అంటే నారాయణ అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం” అని వారు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్ని చేకూరుస్తోందని వివరించారు.
అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు నగరాన్ని మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, వారిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల, ప్రవల్లిక, ప్రశాంతి, శ్రీలక్ష్మి, సుప్రియ, కృష్ణవేణి, నాగేంద్ర బాలు, కృష్ణమోహన్ రెడ్డి, నరహరి, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




