Nellore: నెల్లూరు జిల్లాపై వాయుగుండం ప్రభావం.. సముద్రంలో వేటపై నిషేధం!
Nellore: వాయుగుండం ప్రభావంతో నెల్లూరులో అల్లకల్లోలంగా సముద్రం. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు.
Nellore: నెల్లూరు జిల్లాపై వాయుగుండం ప్రభావం.. సముద్రంలో వేటపై నిషేధం!
Nellore: నెల్లూరు జిల్లా పై వాయుగుండం ప్రభావం. పూర్తి మేఘావృతమైన జిల్లా తీరప్రాంతం. అక్కడక్కడా కొద్దిపాటి వర్షాలు.
వాయిగుండం ప్రభావంతో తీరం వెంట ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలు.సముద్రం లో వేట పై మత్స్యకారులకు నిషేధాజ్ఞలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టరేట్ సహా ఆర్డీవో కార్యాలయాల్లో 0861-2331261,799556699లతో టోల్ ఫ్రీ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.




