Nellore: నుంచే 'కామ్రేడ్ కళ్యాణ్' విజయోత్సవాలు: హీరో విష్ణు సందడి!
Nellore: నెల్లూరులో 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రారంభించిన హీరో విష్ణు, చిత్ర యూనిట్. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన టీమ్.
Nellore: నుంచే 'కామ్రేడ్ కళ్యాణ్' విజయోత్సవాలు: హీరో విష్ణు సందడి!
Nellore: కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా విజయంతో చిత్ర బృందం విజయోత్సవ సంబరాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నెల్లూరులో హీరో విష్ణు, దర్శకుడు ఆర్. మహేష్, నిర్మాత ఎస్. వినోద్ సందడి చేశారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విష్ణు మాట్లాడుతూ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాను విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణ, అభిమానుల ప్రోత్సాహంతోనే సినిమా విజయాన్ని అందుకుందని పేర్కొన్నారు. సినిమా టీజర్, ట్రైలర్ను నెల్లూరు నుంచే ప్రారంభించామని, ఇప్పుడు విజయోత్సవ సంబరాలను కూడా నెల్లూరు నుంచే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
సినిమా విజయోత్సవాలను ప్రతి జిల్లాలో నిర్వహించనున్నట్లు హీరో విష్ణు తెలిపారు. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని వారితో కలిసి వేడుకగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం హీరో విష్ణు తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో దర్శకుడు ఆర్. మహేష్, నిర్మాత ఎస్. వినోద్ పాల్గొన్నారు.




