Podili: పొదిలిలో ఘనంగా గుర్రం జాషువా, భగత్‌సింగ్ జయంతి వేడుకలు!
Podili: పొదిలిలో గుర్రం జాషువా, భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్య నాటక కళాకారులను ఘనంగా సత్కరించారు.
Podili: పొదిలిలో ఘనంగా గుర్రం జాషువా, భగత్‌సింగ్ జయంతి వేడుకలు!
Podili: మహాకవి, సామాజిక వేత్త గుర్రం జాషువా, అమరవీరుడు భగత్‌సింగ్ జయంతి వేడుకలను పొదిలిలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుర్రం జాషువా కళాపీఠం గౌరవ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పద్య నాటక కళాకారులను శాలువాలతో ఘనంగా సత్కరించి దుస్తులను బహుకరించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కల్లం వెంకట సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గుర్రం జాషువా, భగత్‌సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ముఖ్య అతిథులుగా సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గుర్రపుసాల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం వక్తలు గుర్రం జాషువా సాహిత్య సేవలు, సామాజిక చైతన్యానికి ఆయన చేసిన కృషి, భగత్‌సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం గురించి ప్రసంగించారు. కళాకారులు పద్యాలను ఆలపించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో గూడూరి వినోద్, వరికుంట్ల వినోద్ రాజ్, ఎద్దు నగేష్, మానవత జిల్లా మాజీ అధ్యక్షుడు కాకునూరి యలమందారెడ్డి, మాజీ కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, కళాకారులు మొలక పుల్లయ్య, గురవాచారి, యుద్ధం ఆదినారాయణతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.




