Kondapuram: కొమ్మి స్కూల్ కమిటీ చైర్మన్‌గా గుమ్మా శివకృష్ణ ఏకగ్రీవం

Kondapuram: కొండాపురం మండలం కొమ్మి జడ్పీ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్‌గా గుమ్మా శివకృష్ణ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; టీడీపీ శ్రేణులు సత్కారం.

V. Kamaiah, Vinjamuru
Published on: 4 Oct 2026 6:52 PM IST
Kondapuram
X

Kondapuram: కొమ్మి స్కూల్ కమిటీ చైర్మన్‌గా గుమ్మా శివకృష్ణ ఏకగ్రీవం

నెల్లూరు జిల్లా: కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్‌గా గుమ్మా శివకృష్ణ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కొమ్మి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.కొమ్మి గ్రామంలోని కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గుమ్మా శివకృష్ణను టీడీపీ నాయకులు శాలువాతో సత్కరించారు.

రెండోసారి ఏకగ్రీవంగా స్కూల్ కమిటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ మాట్లాడుతూ గుమ్మా శివకృష్ణపై పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామస్తులు మరోసారి నమ్మకం ఉంచి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు.

తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కొమ్మి పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం,అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

తనపై నమ్మకంతో రెండోసారి ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్న పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామస్తులకు గుమ్మా శివకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి,విద్యార్థుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య,బూత్ ఇంచార్జ్ చెరుకూరి శేషయ్య, వెంకపనాయుడు,కొండలరావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru