Gudur: ప్రమాదంలో గాయపడ్డ వైసీపీ నేత సతీష్‌ను పరామర్శించిన రేవంత్

Gudur: గూడూరులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన 14వ వార్డు వైసీపీ నాయకుడు రావల సతీష్‌ను జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి పరామర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Oct 2026 8:21 PM IST
Gudur
X

Gudur: ప్రమాదంలో గాయపడ్డ వైసీపీ నేత సతీష్‌ను పరామర్శించిన రేవంత్

నెల్లూరు జిల్లా: గూడూరు పట్టణ 14వ వార్డు వైసీపీ నాయకులు రావల సతీష్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కు గురై గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి గారు మానవత్వం చాటుకున్నారు.

గూడూరులోని రావల సతీష్ నివాసానికి స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. వైద్యపరంగా ఏ సహాయం కావాలన్నా అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి KM పూర్ణ , నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ వైసీపీ ఉపాధ్యక్షులు షేక్ సుభాన్, నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ , వైసీపీ నాయకులు మణి గారు, సోషల్ మీడియా కన్వీనర్ వినోద్ కుమార్, షేక్ బాబు , సునీల్ తదితర వైసీపీ నాయకులు, యువజన విభాగ నాయకులు పాల్గొన్నారు. గూడూరులో పార్టీ కార్యకర్తకు కష్టం వస్తే వెంటనే స్పందించిన డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి స్థానిక వైసీపీ శ్రేణులు అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్