Vinduru: విందూరులో రూ.12.40 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
Vinduru: గూడూరు మండలం విందూరులో ఎన్‌హెచ్‌ఎం గ్రాంట్ రూ.12.40 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని స్థానిక నాయకులు ఘనంగా ప్రారంభించారు.
Vinduru: విందూరులో రూ.12.40 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
విందూరు: గూడూరు నియోజకవర్గంలో మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో అభివృద్ధి పనులు దూసుకెళ్తున్నాయి. గూడూరు మండలం విందూరు గ్రామంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) గ్రాంట్ ద్వారా 12.40 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు.
విందూరు గ్రామంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నేడు అందుబాటులోకి వచ్చింది.
ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో NHM నిధులను తీసుకువచ్చి ఈ క్లినిక్ లను నిర్మిస్తున్నారు. గతంలో విందూరు గ్రామ ప్రజలు చిన్న అనారోగ్య సమస్యకే గూడూరు, నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ తో గ్రామంలోనే వైద్య సేవలు, మందులు, పరీక్షలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని మండల నాయకులు మరియు గ్రామ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ ప్రారంభోత్సవంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




