Gudur: తుంగపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో సిమెంట్ బెంచీల ఆవిష్కరణ!

Gudur: నెల్లూరు జిల్లా తుంగపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం రెండు సిమెంట్ బెంచీల ఆవిష్కరణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 1:04 PM IST
Gudur
X

Gudur: తుంగపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో సిమెంట్ బెంచీల ఆవిష్కరణ!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు మండలం తుంగపాలెం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రెండు సిమెంట్ బెంచీలను ఆవిష్కరించారు. కీర్తిశేషులు పొంకం నాగేశ్వరరావు (తిరుపాలయ్య), శేషమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ హనుమంతరావు, శ్రీ అనిల్ కుమార్ గార్ల సంపూర్ణ సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కన్నవారి జ్ఞాపకార్థం ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా సిమెంట్ బెంచీలను బహుకరించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలను చాటుకుంటూ సామాజిక శ్రేయస్సును కాంక్షించడమే నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. దైవ సన్నిధిలో పరోపకారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, పొంకం సోదరుల సేవా దృక్పథాన్ని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా స్థానికులు సురేష్ రెడ్డి రవికుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను విశేషంగా ప్రశంసించారు. ప్రగతి సేవా సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా కుటుంబ సభ్యులు కాటూరి శ్రీనివాసులు అడపాల రవికుమార్ కొండూరు సురేష్ రాజు మాములూరు వెంకట్రావు నాగేంద్ర గ్రామస్తులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్