Gudur: గూడూరు శివాలయం నిధుల వివాదం.. ఆరోపణలు నిరూపించు: చైర్మన్ సవాల్!
Gudur: గూడూరు మూలస్థానేశ్వర ఆలయ నిధుల అవినీతి ఆరోపణలను చైర్మన్ బాలకృష్ణ నాయుడు ఖండించారు. నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Gudur: గూడూరు శివాలయం నిధుల వివాదం.. ఆరోపణలు నిరూపించు: చైర్మన్ సవాల్!
Gudur: గూడూరు పట్టణంలోని శ్రీ శ్రీ స్వయంభు మూలస్థానేశ్వర స్వామి శివాలయంలో అభివృద్ధి పనుల పేరుతో చైర్మన్ విరాళాలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారంటూ పాలకమండలి సభ్యుడు ఎం. గురునాథం చేసిన ఆరోపణలను ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, వాటిని ఆధారాలతో నిరూపించాలని గురునాథంకు ఆయన సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపించలేకపోతే పరువునష్టం దావా వేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
గురువారం గూడూరులోని శివాలయంలో పాలకమండలి సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ బాలకృష్ణ నాయుడు మాట్లాడారు. తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భక్తులు, పాలకమండలి సభ్యుల సహకారంతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
దాతల ఇచ్చిన విరాళాలు 8లక్షల 50 వేల రూపాయలు వచ్చిందన్నారు. ఈ మొత్తంలో దేవాలయ అభివృద్ధికి జూన్ 20వ తేదీ నాటికి ఖర్చుపెట్టగా మిగిలిన 1,95,000 ప్రతి ఆలయ పాలకమండలి సభ్యులకు ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టింది మిగిలిన బ్యాలెన్స్ లెక్కలతో సహా ప్రతి ఒక్కరికి జిరాక్స్ చేసి పుస్తక రూపంలో ఇచ్చానన్నారు.
కొంతమంది కమిటీ సభ్యులు మేము విరాళాలు దండ లేదు కదా మీరు ఎందుకు ఈ లెక్కలు మాకు ఇస్తున్నారు అని కూడా అడిగారన్నారు. భక్తుల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నగదును ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించామని వివరించారు. వచ్చిన విరాళాలు, చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను పాలకమండలి సభ్యులకు చూపించామని, ఎవరైనా లెక్కలు పరిశీలించాలనుకుంటే అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.
భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో వారి పేర్ల మీదనే పల్లకీ సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి,ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దు, చైర్మన్ గా నేనిద్దరిని డబ్బులు గురునాథం అకౌంట్లు వేయమని డిమాండ్ చేశారు, ఒకసారి దాదాపు నా దగ్గర వచ్చిన అమౌంట్ లో ఒక లక్ష రూపాయలు ఇవ్వమని తర్వాత ఇస్తానని నమ్మపలికాడు అది నేను తిరస్కరించాను.
ప్రతి దాత అమౌంట్ దేవాలయంలో శిలాఫలకాలలో వేయిస్తున్నానన్నారు. ఇచ్చిన ప్రతిదాతకి రసీదు జర్నీ చైర్మన్ తెలిపారు.. గురునాథం కనీసం ఒక వెయ్యి రూపాయల కూడా దాతల దగ్గర దండక నీవు నా గురించి ప్రశ్నించే హక్కు నీకు లేదన్నారు.
ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని బాలకృష్ణ నాయుడు అన్నారు. అవినీతి జరిగినట్లు భావిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని గురునాథంకు సూచించారు. ఆరోపణలను నిరూపించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే చట్టపరంగా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. నీవు శివాలయంకి
శివుడు దగ్గర నేను దాతలు డబ్బులు ఒక్క రూపాయి కూడా దేవాలయానికి ఇవ్వకుండా 20 లక్షల వరకు ఇంటికి తీసుకెళ్లారని పలికావు అందుకే శివాలయంలో ప్రమాణం చెయ్యి, నేను గతంలో పెద్ద వ్యాపారవేత్తని, ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తినని, దేవాలయం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదన్నారు.
చివరిదిశలో స్వామికి సేవ చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూటమి భాగస్వామ్యంగా ఉన్న బిజెపి నాయకుడిగా నన్ను ఆలయ చైర్మన్ గా చేశారన్నారు. మరొకసారి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.ఆలయ ని ధుల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందాల్సిన అవసరం తనకు లేదని ఆయన పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధి, భక్తుల సేవే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆధారాలతో మాట్లాడాలని, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని బాలకృష్ణ నాయుడు హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు గుడి వెనక నాగ ప్రతిష్టలు ఉన్న రచ్చ పాడు పడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దానిని తొలగించే మీరు కూడా ఉన్నారు
అక్కడ డైమండ్లు బంగారు ఉన్నది దాన్ని నేను తీసుకెళ్లాలని అసత్య ఆరోపణ చేశావు. మీరు, స్వామి, మహేష్, రంగారెడ్డి, అందరూ ఉన్నారు. నీ వెనక ఉండి నడిపించే శక్తులు నిన్ను కాపాడు లేరు. నేను చట్టరీత్యా నీ మీద గురువు నష్టం దావా వేస్తూ చట్ట పరమ కథ చర్యలు తీసుకుంటాను, దాతల పేర్లు మొత్తం
శిలాపాలకాలు పై ముద్రించి నవంబర్ మొదట వారంలో దేవాలయములో ఏర్పాటు చేస్తాను. ప్రతి దాత చూసుకునే విధముగా ఏర్పాటు చేస్తాము.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు.. అరుణ్ కుమార్, వసుధ ,మమత, విజయ, ప్రధాన అర్చకులు.. నరేష్ కుమార్ శర్మ, ఆలయ వాచ్మెన్ రంగారెడ్డి, పాల్గొన్నారు.




