Gudur: గూడూరు విద్యా మణిహారం ఎస్.కె.ఆర్. డిగ్రీ కళాశాల
Gudur: గూడూరు ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ 2026 ఘనంగా నిర్వహించారు; అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ పిలుపు.
Gudur: గూడూరు విద్యా మణిహారం ఎస్.కె.ఆర్. డిగ్రీ కళాశాల
గూడూరు: గూడూరులోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ 2026 కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాం ప్రసాద్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాం ప్రసాద్ మాట్లాడుతూ గూడూరు ప్రాంతంలో ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక విద్యా మణిహారంగా నిలుస్తోందని, కళాశాల సాధించిన ప్రగతి, విద్యార్థులకు అందిస్తున్న విద్యా అవకాశాలు, వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.
విద్యార్థులు కళాశాలలో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కె. చంద్రహాస్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని, చదువుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వం కళాశాలల్లో నిర్వహిస్తున్న వివిధ విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ
కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పి. నారాయణ రాజు, డాక్టర్ ఎస్.వి. నాగేంద్ర ప్రసాద్ కళాశాలతో తమకున్న అనుబంధాన్ని, కళాశాల ప్రత్యేకతను, గూడూరు ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర, ప్రస్థానాన్ని వివరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందిస్తున్న ప్రోత్సాహం తదితర అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా కళాశాలలో ప్రవేశం పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు కళాశాల విద్యా వాతావరణం, విద్యా అవకాశాలు, కళాశాల కార్యకలాపాలు, విద్యార్థుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.ఈ
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కిరణ్మయి, అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ కె. లావణ్య, వాసంతి, డాక్టర్ యశోద, వి.వి. రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




