Gudur: అంగన్వాడీ ఆయాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

Gudur: గూడూరు ICDS ఆధ్వర్యంలో 260 మంది అంగన్వాడీ ఆయాలకు పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు వంట విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Oct 2026 7:07 PM IST
Gudur
X

Gudur: అంగన్వాడీ ఆయాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

గూడూరు: గూడూరు ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆయాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ ట్రైనింగ్ నిర్వహించడం విశేషం.

గూడూరు ICDS రూరల్ మరియు అర్బన్ పరిధిలో పనిచేస్తున్న మొత్తం 260 మంది అంగన్వాడీ ఆయాలకు శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయాలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

1. ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ప్రేలను వాడు కొనే విధానం

2. పిల్లలకు వంట చేసే విధానము

3. అంగన్వాడీ కేంద్రాల్లో పాటించాల్సిన పరిశుభ్రత.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు CDPO మేడం ముఖ్య అతిథిగా.హాజరై ఆయాలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే ఆఫీసులోని అకౌంటెంట్ కూడా పలు అంశాలను తెలియజేస్తూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.

ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి పెట్రాలు, సూపర్ వైజర్లు, ఆఫీసు స్టాఫ్, ఆయాలు, పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో ఆయాల పాత్ర ఎంతో కీలకమని, అందుకే ఈ శిక్షణ ఎంతో అవసరమని CDPO తెలిపారు. ఇలాంటి శిక్షణ వల్ల కేంద్రాల్లో మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్